హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్ లాంటి వాడిని తయారు చేశారా?: అక్రమ్

పాకిస్థాన్ సూపర్ లీగ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. PSL నుంచి వైభవ్ సూర్యవంశీ లాంటి ప్రతిభావంతుడైన ఆటగాడిని ఒక్కరినైనా తయారు చేశారా అంటూ ప్రశ్నించారు. వైభవ్‌ను ప్రస్తావిస్తూ పాకిస్థాన్ క్రికెట్ వ్యవస్థపై చురకలు అంటించారు. యువ ప్రతిభను వెలికితీయడంలో పీఎస్ఎల్ విఫలమవుతోందన్నట్టుగా అక్రమ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.