హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చెట్లు విరిగిపడితే సమాచారం అందించాలి'

ASR: ప్రస్తుతం ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని జీకేవీధి మండలం సీలేరు ఎస్సై ఎండీ యాసిన్ ఇవాళ ప్రజలకు సూచించారు. వర్షాల నేపథ్యంలో రహదారులపై అక్కడక్కడా చెట్లు విరిగిపడుతున్నాయని తెలిపారు. ఎక్కడైనా చెట్లు విరిగిపడి, రాకపోకలకు అంతరాయం ఏర్పడితే తమకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. చెట్లు తొలగించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.