హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్‌క్రాస్ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల

ADB: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆదిలాబాద్ జిల్లా శాఖ ఎన్నికల షెడ్యూల్, ఓటర్ల జాబితా ఖరారైంది. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ప్రజా పరిషత్ సీఈవో ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 9న విడుదల చేయగా రెడ్‌క్రాస్ సొసైటీతో పాటు సంబంధిత కార్యాలయాల నోటీస్ బోర్డులపై ప్రదర్శించారు. అభ్యంతరాలు ఉంటే 15వ తేదీలోగా తెలపాలని సూచించారు.