హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలి'

ELR: వినాయక చవితి వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీలు నిబంధనలు పాటించాలని డీఎస్పీ బి.హెచ్. వెంకటేశ్వర్లు సూచించారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ వద్ద మండపాల నిర్వాహకులు, డీజే సౌండ్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు అనుమతులు, భద్రతా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.