CTR: బైరెడ్డిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈనెల 13న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు శిబిరం ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఇందులో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. కంటి సమస్యలు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఉచిత కంటి వైద్య శిబిరం


