హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

విశాఖలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజాంకు చెందిన బీటెక్ విద్యార్థి గొల్లపల్లి యోగీశ్వరరావు(19) మృతిచెందాడు. తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న యోగీశ్వరరావు రోడ్డు దాటుతుండగా ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొట్టింది. ఘటనలో అక్కడికక్కడే మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.