హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్‌లో నీటి కోసం రైతుల ఆరాటం

మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షాభావ పరిస్థితులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తొలకరి వర్షాలతో ఆశపడి వరి సాగు చేసిన రైతులకు పంట ఒక దశకు చేరిన తర్వాత నీటి కొరత ఎదురైంది. దీంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. కొందరు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పంటలను కాపాడుకుంటుండగా, మరికొందరు నీరులేక నిస్సహాయంగా చూస్తున్నారు.