హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్హతే ప్రామాణికంగా పింఛన్లు: గౌరు

NDL: పాణ్యం నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, అర్బన్ పరిధిలోని 16 వార్డుల ఇన్‌చార్జిలు, గ్రామ నాయకులతో శుక్రవారం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి సమీక్ష నిర్వహించారు. టీడీపీ సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డితో కలిసి పింఛన్ల అర్హతలు, లబ్ధిదారుల గుర్తింపు, పంపిణీ ప్రక్రియపై చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం అందేలా సమన్వయంతో పనిచేయాలన్నారు.