ఆంధ్రప్రదేశ్
వినాయక మండపాలకు తాత్కాలిక ఉచిత విద్యుత్ - SE
VZM వినాయక చవితి సందర్భంగా గణేశ్ మండపాలకు ఉచితంగా తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు APEPCDL SE ఎం.లక్ష్మణరావు శుక్రవారం తెలిపారు. ఈ నెల 14 నుంచి 22 వరకు గ్రామీణ ప్రాంతాల్లో ౩ KW, పట్టణాల్లో 5 KW వరకు ఈ సదుపాయం ఉంటుందన్నారు. నిర్వహకులు దరఖాస్తులను స్థానిక AE లకు అందజేయాలని, విద్యుత్ సిబ్బంది వచ్చి కనెక్షన్లు ఏర్పాటు చేస్తారని తెలిపారు.


