హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇద్దరు హెచ్ఎంలకు నోటీసులు

CTR: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ప్రధానోపాధ్యాయులకు నోటీసులు జారీ చేసినట్లు డీఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. నగరి మండలం ఏకాంబరకుప్పం జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం నమశ్శివాయ, పలమనేరు మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం షంషీర్‌కు నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఉపాధ్యాయులు విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.