హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం: భూపేష్ రెడ్డి

అన్నమయ్య: జమ్మలమడుగు TDP కార్యాలయంలో శుక్రవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి 500 మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను పూజించాలని ఆయన పిలుపునిచ్చారు. వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూనే ప్రకృతిని కాపాడుకోవాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో నీరు, పర్యావరణం కలుషితమవుతాయని తెలిపారు.