హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కృష్ణా: విద్యుత్‌ లైన్ల మరమ్మతులు, సబ్‌స్టేషన్‌ నిర్వహణ పనుల కారణంగా గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇవాళ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు తారకటూరు, ముక్కొల్లు, కల్పటం, పీఎన్‌జీ లంక, కంచకోడూరు, తుమ్మలపాలెం, గూడూరు, మల్లవోలు, ముత్రాసుపాలెం గ్రామాల్లో సరఫరా నిలిచిపోతుందని ఈఈ జి.గోవిందరావు తెలిపారు.