హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగ్గయ్యపేటలో రెవెన్యూ మేళా..!

NTR: జగ్గయ్యపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో రెవెన్యూ మేళా నిర్వహించనున్నారు. పురపాలక సంఘ కార్యాలయంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేళా జరుగుతుంది. ఆస్తి పన్ను, పేరు మార్పులు, కొత్త ఆస్తి పన్నుల విధింపు తదితర రెవెన్యూ సంబంధిత పనుల కోసం పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.