హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నల్లపాడు హైవేపై ప్రమాదం

GNTR: నల్లపాడు పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. విజయవాడ నుంచి చిలకలూరిపేట వెళ్తున్న బడాదోస్త్ వాహనాన్ని వెనుక నుంచి టాటా కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బడాదోస్త్ వాహనం బోల్తా పడి ప్రకాశం జిల్లాకు చెందిన డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.