PLD: వినుకొండ(M) పెదకంచెర్లలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ‘మీ భూమి–మీ హక్కు’ పథకంలో భాగంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలను అందజేశారు. రైతులకు భూములపై పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జీవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెదకంచర్లలో రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ


