KDP: పోరుమామిళ్లలోని 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో శనివారం నిర్వహణ పనులు చేపడుతున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవికుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన, బి.కోడూరు మండలాల్లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత


