గద్వాల్: దళితుల ఇంటిని కూల్చడం అనాగరిక చర్య అని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మణికుమార్ అన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం ఆయన రేపల్లెలో కూల్చిన దళితుల ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంటిని కూల్చివేయడం హేయమైన చర్య అన్నారు. నిందితులను శిక్షించాలని కోరారు.
తెలంగాణ
'దళితుల ఇంటిపై దాడి.. నిందితులను శిక్షించాలి'


