హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం, సీతక్క చిత్రపటాలకు క్షీరాభిషేకం

MDK: మనోహరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చిత్రపటాలకు సర్పంచులు క్షీరాభిషేకం నిర్వహించారు. గ్రామ పంచాయతీలకు నేరుగా ఖాతాలలో నిధులు జమ చేసేందుకు అసెంబ్లీలో ఆమోదం తెలపడంతో సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి అనూష భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేపట్టారు. నేరుగా నిధులు ఖాతాలలో వేయడంతో ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు.