హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రీడలతో విద్యార్థులకు బంగారు భవిత

ELR: నూజివీడు మండలం అన్నవరం జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు వివిధ ఆటలు, క్విజ్ పోటీలు శుక్రవారం నిర్వహించారు. పాఠశాల ఇంఛార్జి హెచ్ఎం రవీంద్ర మాట్లాడుతూ.. చదువుతోపాటు విద్యార్థి దశలో కనీసం రెండు క్రీడాంశాలలో ప్రతిభ కనపరచడం ద్వారా బంగారు భవితకు భరోసా కలుగుతుందన్నారు. క్రీడాకారులతో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలకు భరోసా ఉందన్నారు.