చిత్తూరులో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురికి రూ.60 వేల జరిమానా విధించారు. అలాగే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ వ్యాపారం నిర్వహించిన 123 మందికి రూ.66,150 జరిమానా పడింది. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనలు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నరసింహరాజు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరులో భారీ జరిమానాలు


