హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేటపాలెంలో చెకుముకి సైన్సు సంబరాలు

BPT: జన విజ్ఞాన వేదిక సైన్స్ సంబరాలలో భాగంగా శుక్రవారం వేటపాలెం జడ్పీ హైస్కూల్లో మండల స్థాయి 'చెకుముకి' టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.  పందిళ్ళపల్లి, వేటపాలెం, దేశాయిపేట జడ్పీ హైస్కూళ్ల విద్యార్థులు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. విజేతలను ఎంఈఓ, హెచ్ఎంలు, జన విజ్ఞాన వేదిక నాయకులు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.