హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇన్‌స్పైర్ మనక్ జాతీయ పోటీలకు పల్నాడు విద్యార్థి

PLD: అమరావతి మండలం లేమల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి బన్న రావూరి మణికంఠ సాయి ఇన్‌స్పైర్ మనక్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వెల్డింగ్ వృత్తి నిపుణుల కోసం రూపొందించిన ‘ప్రొటెక్టివ్ హెల్మెట్’ ప్రాజెక్టుకు ఈ ఎంపిక లభించింది. విద్యార్థిని డీఈఓ రామారావు అభినందించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి జిల్లా, రాష్ట్ర కీర్తిని పెంచాలన్నారు.