హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలి: కలెక్టర్

ADB: ఈ నెల 17న నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ’ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగే ప్రధాన వేడుకలకు సంబంధించి విద్యుత్, ప్రొటోకాల్, భద్రత, పరిశుభ్రత ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.