హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉట్నూరు డిగ్రీ కళాశాలకు రాష్ట్రస్థాయి అవార్డులు

ADB: తెలంగాణ ఉన్నత విద్యాశాఖ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి 'జిజ్ఞాస' విద్యార్థుల అధ్యయన ప్రాజెక్టుల పోటీలలో ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అద్భుత ప్రతిభ కనబరిచింది. ఇందులో భాగంగా రెండు రాష్ట్ర స్థాయి అవార్డులను కైవసం చేసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు రాష్ట్రస్థాయిలో రాణించడం గర్వకారణమన్నారు.