హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మట్టి గణేష్‌ను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలి'

ADB: పర్యావరణహితమైన మట్టి గణేష్‌ను ప్రతిష్ఠించాలని హెచ్ఎం కృష్ణకుమార్ అన్నారు. బేల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మట్టి గణపతిపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులచే మట్టి గణేష్‌ను తయారుచేసి స్థానికులకు పంచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులున్నారు.