KNR: వినాయక చవితి పండుగ నేపథ్యంలో వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో కరీంనగర్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. పండుగను స్వగ్రామాల్లో జరుపుకునేందుకు నగరం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు బస్టాండ్‌కు చేరుకున్నారు. దీంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను అందుబాటులో ఉంచారు.
తెలంగాణ
VIDEO: వినాయక చవితి.. బస్టాండ్‌లో రద్దీ


