హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రధాన కాలువకు గండి.. నీరు వృధా

MNCL: భీమారం మండల కేంద్రంలోని గొల్లవాగు ప్రాజెక్టు ప్రధాన కాలువకు శుక్రవారం గండి పడింది. బీసీ హాస్టల్ సమీపంలో గండి పడడంతో నీరు వృథాగా పోతోంది. భీమారం, ఆరేపల్లి, ఎల్బీ పేట, కొత్తపల్లి తదితర గ్రామాల వ్యవసాయ అవసరాల కోసం ఈ కాలువను నిర్మించారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.