హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోదండరామస్వామిని దర్శించుకున్న బ్రెజిల్ వాసులు

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని శుక్రవారం సాయంత్రం బ్రెజిల్‌కు చెందిన భక్తులు సందర్శించారు. తీర్థయాత్రలో భాగంగా రామేశ్వరం, హంపి, ఒంటిమిట్ట, తదితర పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నట్లు తెలిపారు. అర్చకులు వారికి స్వామివారి దర్శనం కల్పించి, ఆలయ విశిష్టతను వివరించారు.అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. కోదండరామయ్యను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.