హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సరఫరాపై సీఈ పరిశీలన

MHBD: తొర్రూరు పట్టణంలోని టీజీఎన్‌పీడీసీఎల్ సీఈ/ఆపరేషన్స్-2 గౌతమ్ రెడ్డి శుక్రవారం చెట్లముప్పారం, ఖానాపురం 33/11 కేవీ సబ్‌స్టేషన్లను పరిశీలించారు. ఫీడర్ల వారీగా లోడ్, విద్యుత్ సరఫరా, పరికరాల పనితీరును సమీక్షించారు. నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరాకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు నష్టపోవద్దని సూచించారు.