హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శాస్త్రీయ పద్ధతులు పాటించాలి'

SKLM: వరి సాగులో శాస్త్రీయ పద్ధతులు, సరైన ఎరువుల వినియోగం, సకాలంలో సస్యరక్షణ చర్యలు పాటించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. కంచిలి మండల రైతు సేవా కేంద్రంలో ఆత్మ పథకం కింద శుక్రవారం రైతులకు శిక్షణ నిర్వహించారు. ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ జగన్మోహన్‌రావు మాట్లాడుతూ.. పొటాష్ లోప నివారణ, కలుపు నివారణ, రబీలో ఆరుతడి పంటలతో నీటి పొదుపుపై వివరించారు.