కృష్ణా: బాపులపాడు మండలం సింగన్నగూడెంలోని గంగా పార్వతి సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి విజయవాడకు చెందిన దండమూడి లక్ష్మీ వెంకట శ్రీధర్ రూ.1 లక్ష విరాళం శుక్రవారం అందజేశారు. ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం చెక్కును ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. అర్చకులు నాగేశ్వర శర్మ, ఉపసర్పంచ్ బెజవాడ వెంకటకృష్ణరావు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత


