కృష్ణా: బాపులపాడు మండలం రేమల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్-3లో 9వ పోషణ మాసోత్సవం శుక్రవారం నిర్వహించారు. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు జరిగే పోషణ మాసోత్సవాల్లో భాగంగా కార్యక్రమం చేపట్టారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కే. సుమిత్ర గర్భిణులు, బాలింతలకు పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
రేమల్లిలో పోషణ మాసోత్సవం కార్యక్రమం


