W.G: తణుకు మండలం వేల్పూరులో ఇవాళ అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి చెందాడు. స్థానికంగా అన్నపూర్ణ రైస్ మిల్లులో పనిచేస్తున్న అవిడి దుర్గా ప్రసాద్ (40) రైస్ మిల్లు శుభ్రం చేసే క్రమంలో పైనుంచి కింద పడి మృతి చెందినట్లుగా తోటి కార్మికులు చెబుతున్నారు. మృతుడి భార్య మీనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి


