హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శత శాతం ఉత్తీర్ణత సాధించాలి'

AKP: పదవ తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని డీఈవో నాగేశ్వరరావు సూచించారు. శుక్రవారం నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు జడ్పీ హైస్కూల్‌ను తనిఖీ చేశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. పక్కా ప్రణాళికతో విద్యాబోధన జరగాలన్నారు.