ASR: అడవులు, వన్యప్రాణుల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన అటవీ అమర వీరుల సేవలు చిరస్మరణీయమని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం అరకులోయలో జాతీయ అటవీ అమర వీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. FRO కోటేశ్వరరావు, సిబ్బంది అమర వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంస్మరణ కవాతు నిర్వహించి గౌరవ వందనం సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
అటవీ అమర వీరులకు ఘన నివాళి


