హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి శిక్ష

VZM: మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడిన భీమవరపు సూరిదేముడు అనే వ్యక్తికి స్పెషల్ మేజిస్ట్రేట్ పీలా మీనాక్షి 15 రోజుల జైలుశిక్ష విధించినట్లు ఎస్‌.కోట సీఐ నారాయణమూర్తి శుక్రవారం తెలిపారు. ఎస్ఐ ఆధ్వర్యంలో దేవిగుడి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. అమ్మపాలెం గ్రామానికి చెందిన సదరు వ్యక్తి బొడ్డవరం నుండి ఎస్‌.కోట వైపు వస్తూ పట్టుబడినట్లు పేర్కొన్నారు.