హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగిత్యాలకు ఐటీ హబ్ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే

JGL: జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబును కోరారు. అలాగే కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట ఐటీ హబ్‌లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు. ఉత్తర తెలంగాణలో జగిత్యాల ముఖ్యమైన ప్రాంతమని, ఐటీ హబ్ ఏర్పాటు వల్ల జిల్లాలోని నిరుద్యోగులకు ఉపయోగపడుతుందన్నారు.