HYD: వినాయక చవితిని పురస్కరించుకుని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మట్టి గణపతిని అందజేశారు. మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సంప్రదాయాలను కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
తెలంగాణ
డిప్యూటీ సీఎం కి మట్టి గణపతి అందజేత


