హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యుత్ తీగలు తగిలి వినాయక విగ్రహం ధ్వంసం

JGL: కోరుట్ల పట్టణం నుంచి నందిపేటకు శుక్రవారం తరలిస్తున్న భారీ వినాయక విగ్రహం మెట్‌పల్లి-కమ్మర్‌పల్లి మధ్య ప్రమాదానికి గురైంది. ఎత్తు ఎక్కువగా ఉండడంతో విద్యుత్ తీగలకు తగిలి విగ్రహం ధ్వంసం కాగా, స్తంభం విరిగి తీగలు తెగిపడ్డాయి. ఒక్కసారిగా శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు.