హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

CTR: మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితం అంధకారం అవుతుందని పూతలపట్టు సీఐ తిమ్మయ్య తెలిపారు. పూతలపట్టు జడ్పి ఉన్నత పాఠశాలలో ఈగల్ బృందం ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల అనర్థాలపై ఆయన శుక్రవారం అవగాహన కల్పించారు. విద్యార్థులు చెడు అలవాటులకు బానిస కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కోరారు.