హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉచిత కూల్ డ్రింక్స్.. పోటెత్తిన జనం

JGL: మెట్‌పల్లి పట్టణ ప్రధాన కూడలిలో ఓ డీలర్ శుక్రవారం ఉచితంగా కూల్ డ్రింక్స్ పంపిణీ చేయడంతో జనం పోటెత్తారు. ఫ్రీ అని తెలియగానే వందల మంది క్యూ కట్టారు. ఈ క్రమంలో తోపులాట కూడా జరిగింది. అయితే, ఈ కూల్డ్రింక్స్ గడువు ఈ నెల 19తో ముగుస్తుండటంతోనే పంపిణీ చేసినట్లు సమాచారం. దీంతో నాణ్యతపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.