హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సచివాలయాల్లో ఎమ్మెల్యే తనిఖీలు

అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలం చిన్న ఓరంపాడు, ముక్కావారిపల్లి సచివాలయాలను కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, సమయపాలన, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందేలా దరఖాస్తు ప్రక్రియలో ప్రజలకు సహకరించారు. ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలన్నారు.