KKD: కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో పోలీసులు మాదక ద్రవ్యాల నిరోధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి అక్రమ సాగు, రవాణా, విక్రయం, నిల్వ, వినియోగం చట్టరీత్యా నేరమని ఎస్సై రామకృష్ణ తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ.. గంజాయి రహిత సమాజ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'గంజాయి రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలి'


