హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి'

AKP: విద్యార్థులు చెడువ్యసనాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని నక్కపల్లి రూరల్ సీఐ ఎల్.రామకృష్ణ సూచించారు. శుక్రవారం ఎస్.రాయవరం జెడ్పీ హైస్కూల్‌లో అభయపై అవగాహన సదస్సు నిర్వహించారు. లక్ష్యాలను నిర్దేశించుకుని సాధనకు కృషి చేయాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.