KDP: సిద్ధవటం మండలం చలమారెడ్డికొట్టాలు గ్రామంలో తాగునీటి పైపు పగిలి గత 10 రోజులుగా నీరు వృథాగా పంట పొలాల్లోకి ప్రవహిస్తోందని స్థానికులు తెలిపారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పగిలిన పైపును వెంటనే మరమ్మతు చేసి తాగునీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి పైపు పగిలి నీరు వృథా


