హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎక్సైజ్ సీఐ సుస్మితకు గౌడ సంఘాల సన్మానం

MLG: ములుగు ప్రొహిబిషన్ &ఎక్సైజ్ స్టేషన్‌కు నూతనంగా బదిలీపై వచ్చిన సీఐ సుస్మితను ములుగు గీత పారిశ్రామిక సహకార సంఘం, గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసిశాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గౌడ సమస్యలపై చర్చించారు. సంఘం అధ్యక్షుడు పైడిమల్ల శివశంకర్ గౌడ్, మోకుదెబ్బ రాష్ట్రఅధికార ప్రతినిధి ముంజల బిక్షపతి తదితరులున్నారు.