హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాల స్థాయిలో క్రీడలను ప్రోత్సహిస్తాం: కలెక్టర్

ATP: పాఠశాల స్థాయి క్రీడలను ప్రోత్సహించేందుకు 'స్కూల్స్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్’ కార్యక్రమం అమల్లోకి తెచ్చినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్తామన్నారు. రూ. 20 లక్షల వ్యయంతో క్రీడలు నిర్వహించి, బహుమతులు అందిస్తామన్నారు.