హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించాలి: బీజేపీ

KNR: సెప్టెంబరు 17ను 'తెలంగాణ విమోచన దినోత్సవం'గా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. కరీంనగర్‌లో నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. సర్దార్ పటేల్ 'ఆపరేషన్ పోలో'తోనే తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. హైదరాబాద్‌లో 'స్టాచ్యూ ఆఫ్ లిబరేషన్', విమోచన మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు.