హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్

ELR: పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి తీగలను చోరీ చేస్తున్న ముగ్గురు పాత నేరస్థులను భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలసానిపల్లి డంపింగ్ యార్డు వద్ద వాహనాల తనిఖీ చేస్తూ.. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురుని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 50 కిలోల రాగి తీగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.