హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివపరాశక్తి పీఠంలో ఘనంగా అమావాస్య పూజలు

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ శివ పరాశక్తి పీఠంలో శుక్రవారం సాయంత్రం అమావాస్య పూజలు ఘనంగా జరిగాయి. పీఠాధిపతి మనోహర్ రాజు గురూజీ ఆధ్వర్యంలో శివలింగానికి పంచామృతాభిషేకం, అన్నాభిషేకం, సప్తహారతులు నిర్వహించారు. వేదమంత్రాల మధ్య పీఠం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.